బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీ కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో ఓ చిత్రం పట్టాలెక్కనుందని.. దీనికి 'సంకి' అనే పేరు పెట్టనున్నట్లు సినీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిలా ఉండగా మరో తమిళ దర్శకుడి పేరు ఇప్పుడు తెరమీదకొచ్చింది.
ఇటీవలే 'అసురన్' సినిమాతో ఘన విజయం అందుకున్నాడు దర్శకుడు వెట్రిమారన్. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ డైరెక్టర్ షారుఖ్‌తో కలవడం మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు వార్తలూ వచ్చాయి.