కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(29 years for Shahrukh) హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి నేటితో 29 ఏళ్లు పూర్తయ్యింది. కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో 'ఫౌజీ', 'సర్కస్' బుల్లితెర షోలలో పనిచేసిన షారుక్.. 1992లో విడుదలైన 'దివానా'(Deewana) చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. అయితే ఈ సందర్భంగా ట్విట్టర్లో అభిమానులతో సరదాగా ముచ్చటించారు షారుక్. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానమిచ్చారు.
ప్రశ్న:ప్రస్తుతం మీరు హీరోగా ఏ దశలో ఉన్నారు?
షారుక్:హీరోగా తన కెరీర్‌ను పునర్నిర్మాణ దశలో ఉన్నా. నా జీవితంలో ఈ 30 ఏళ్ల సమయం ఎంతో గొప్పగా గడిచింది.
ప్రశ్న:నటుడిగా ప్రతి రోజు ప్రేరణ పొందే అంశం ఏమిటి?
షారుక్:నటుడిగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే నాకు ప్రేరణ.
ప్రశ్న: దర్శకుడురాజ్కుమార్ హిరాణీతో మీ తర్వాతి చిత్రం చేస్తున్నారనేది నిజమేనా?
షారుక్:ఇదే విషయాన్ని అడగేందుకు నేనిప్పుడే అతడికి కాల్ చేశా. కానీ, అతడు నిద్రపోతున్నాడని తెలిసింది.(సరదాగా)
షారుక్ ఖాన్.. హీరోగా 'చమత్కార్', 'రాజు బన్ గయా జెంటిల్‌మ్యాన్', 'ఢర్', 'భాజిగర్', 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే', 'దిల్ తో పాగల్ హై', 'కుచ్ కుచ్ హోతా హై', 'దేవదాస్', 'స్వదేశ్', 'కల్ హో నా హో', 'చక్ దే! ఇండియా', 'మై హూన్ నా', 'మై నేమ్ ఈజ్ ఖాన్', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. షారుక్ చివరిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'జీరో' చిత్రంలో ప్రేక్షకులను అలరించారు.
షారుక్ ఖాన్.. ప్రస్తుతం యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మాణసంస్థ రూపొందిస్తోన్న యాక్షన్-థ్రిల్లర్ 'పఠాన్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నారని సమాచారం. ప్రతినాయకుడి పాత్రను జాన్ అబ్రహం పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తర్వాత రాజ్‌కుమార్ హిరాణీ, తమిళ దర్శకుడు అట్లీతో సినిమాలు చేయనున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి..priyamani: ప్రియమణికి షారుక్‌ఖాన్ రూ.300.. ఎందుకు?