బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తన అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అంటూ మంగళవారం సాయంత్రం ట్విట్టర్ చాట్ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు ఆసక్తికర ప్రశ్నలు అడిగితే.. మరికొందరు ట్రోల్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. వీటికి షారుక్ తన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. "భాయ్... మన్నత్‌ను (షారుక్ ఇల్లు) అమ్మేందుకు ప్రయత్నిస్తున్నావా?" అని ప్రశ్నించారు. దీనికి షారుక్ స్పందిస్తూ.. "బ్రదర్, మన్నత్‌ను అమ్మలేం. అది ప్రార్థన కోసం ఉపయోగించే ఉర్దు పదం. నిజంగా నీకు అది కావాలంటే తల వంచుకుని వినయంగా అడుగు. జీవితంలో దేన్నైనా సాధించాలి అనుకుంటే.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో" అని పేర్కొన్నారు. ఇలా ఫాలోవర్స్‌కు, ఆయనకు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ చూద్దాం..
షారుక్-గౌరీ బంధానికి 29 ఏళ్లు పూర్తయింది. గౌరీ మేడమ్‌కు ఏం బహుమతి ఇచ్చారు?
షారుక్: నా జీవితంలోని అతి పెద్ద కానుకకు (గౌరీ) నేనేం గిఫ్ట్ ఇవ్వగలను?
బాగోలేని స్క్రిప్టులు ఎంచుకున్నానని గత పదేళ్లలో ఎప్పుడైనా బాధపడ్డారా?
షారుక్: ఓ వ్యక్తికి తను చేసే పనిపై పూర్తి నమ్మకం ఉండాలి. దాని కోసం దృఢంగా నిలబడగలగాలి. మీ మనసులో నమ్మకం ఉండటం ముఖ్యం.
మీ పిల్లలు మిమ్మల్ని డాడీ అంటారా? డాడ్ అంటారా?
షారుక్: పాపా అంటారు.
ఎలా ఉన్నావు షారుక్? మిమ్మల్ని ప్రశ్నించడం కోసం ట్వీట్ చేయడం లేదు. నవంబరు 26న నా వివాహం జరగబోతోంది, మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నా.
షారుక్: నువ్వు, నీ జీవిత భాగస్వామి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.
ఐదేళ్ల వయసు నుంచి మీరే నా రోల్ మోడల్.
షారుక్: నా ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి.
సర్.. మిమ్మల్ని త్వరలో వెండితెరపై చూడాలనుకుంటున్న అభిమానుల గురించి మాట్లాడండి.
షారుక్:త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ చేసి... విడుదల చేస్తాం. దీనికి దాదాపు ఏడాది పడుతుంది.
పుట్టినరోజును (నవంబరు 2) ఎలా ప్లాన్ చేయబోతున్నారు. మన్నత్ ముందుకు రావడానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు.
షారుక్: నా పుట్టినరోజైనా, మరో విషయమైనా.. దయచేసి ఎవరూ గుంపులు గుంపులుగా చేరకండి. మీరు సురక్షితంగా ఇంట్లో ఉంటే నాపై ప్రేమ చూపినట్లే.