కరోనా లాక్డౌన్ కారణంగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తమిళ చిత్రం 'సూరారై పోట్రు' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు అంగీకరించింది చిత్రబృందం. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ఫ్యాన్స్‌కు సూర్య సర్ప్రైజ్.. నేరుగా ఓటీటీలోనే - Romelu Lukaku
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరారై పోట్రు' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ప్రైమ్‌లో సూర్య 'సూరారై పోట్రు'.. విడుదల ఖరారు
ఈ చిత్రంలో టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహించగా.. సూర్య, బాలీవుడ్ నిర్మాత గుణీత్ మోంగ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ స్వరాలను సమకూరుస్తున్నారు.
తెలుగులో ఈ చిత్రం 'ఆకాశమే హద్దురా' పేరుతో తెరకెక్కింది. అయితే తమిళంతో పాటే తెలుగులోనూ విడుదల చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.