తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సెవెన్'​ చిత్రం విడుదలకు ఎన్నారై ఆటంకం - seven movie not released due to court stay

హ‌వీష్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ నిర్మించిన చిత్రం 'సెవెన్'​. ఈ సినిమా జూన్​ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన తరుణంలో... చిత్ర నిర్మాతలకు కోర్టు షాకిచ్చింది. సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలిస్తూ స్టే విధించింది సివిల్‌ కోర్టు.

'సెవెన్'​ చిత్రం విడుదలకు ఎన్నారై ఆటంకం

By

Published : Jun 5, 2019, 9:00 AM IST

సెవెన్​ చిత్రం విడుదలపై కోర్టు స్టే విధించింది. ఫలితంగా నేడు సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. హవీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిజార్ షఫీ దర్శకుడు. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ నిర్మించారు.

ఎన్నారై ఫిర్యాదు...

నిర్మాత రమేష్‌ వర్మపై ఎన్నారై కిరణ్‌ టి.తులసీరామ్‌ కేసు వేశారు. ‘సెవెన్‌’ సినిమాలో తనకు భాగస్వామ్యం ఇస్తానని రమేష్‌ చెప్పారని... అందుకోసం పెద్ద మొత్తంలో తన నుంచి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి రమేష్​ వర్మ తనని పట్టించుకోలేదని భాగస్వామ్యం ఇవ్వకపోగా.. తాను ఫోన్​ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ను సంప్రదించినా ఫలితం లేదని చెప్పారు. అందుకే చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు తులసీరామ్​ పేర్కొన్నారు. ఈ వివాదం కారణంగా కోర్టు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details