తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కృష్ణ జింక వేట కేసు విచారణకు సల్మాన్ గైర్హాజరు - 1998 Blackbuck poaching case

కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్​ నేడు కోర్టు ముందు హాజరవ్వలేదు. ఫలితంగా ఈ కేసును డిసెంబర్19కి వాయిదా వేస్తున్నట్లు జోధ్​పూర్ డిస్ట్రిక్ట్​ అండ్ సెషన్స్ కోర్డు తెలిపింది.

సల్మాన్

By

Published : Sep 27, 2019, 12:15 PM IST

Updated : Oct 2, 2019, 4:58 AM IST

బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్.. కృష్ణ జింకల వేట కేసులో నేడు జోధ్​పూర్ కోర్టులో హాజరవ్వాల్సి ఉంది. షూటింగ్​లో బిజీ ఉన్న కారణంగా హాజరుకావడం లేదంటూ సల్మాన్​ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఫలితంగా కేసు డిసెంబర్ 19కి వాయిదా పడింది.

సల్మాన్ తరఫున న్యాయవాది కోర్టులో రెండు దరఖాస్తులు సమర్పించుకున్నాడు. నేడు (శుక్రవారం) విచారణకు మినహాయింపు కోరుతూ ఒకటి.. పూర్తిగా వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వడం మరొకటి. మొదటి దరఖాస్తును అంగీకరించిన కోర్టు.. రెండో దానిపై విచారణ డిసెంబర్ 19కి వాయిదా వేసింది.

గతేడాది మేలో సల్మాన్​కు ఈ కేసులో బెయిల్ ముంజూరైంది. అప్పటి నుంచి కోర్టు మెట్లెక్కలేదు ఈ నటుడు. ఈ ఏడాది జులై 4న జరిగిన విచారణ సందర్భంగా, సెప్టెంబరు 27న కోర్టు ముందు హాజరు కావాలని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కుమార్ సొరంగా తీర్పిచ్చారు. లేదంటే సల్మాన్​కు బెయిల్​ రద్దవుతుందని చెప్పారు.

1998లో 'హమ్ సాత్ సాత్ హైన్' సినిమా షూటింగ్ సందర్భంగా జోధ్​పూర్​లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది.

ఇవీ చూడండి.. ఈ తెలుగు ప్రేమకథకు ఓ ప్రత్యేకత ఉంది తెలుసా?

Last Updated : Oct 2, 2019, 4:58 AM IST

ABOUT THE AUTHOR

...view details