వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో శర్వానంద్. ఇటీవలే 'రణరంగం'తో అలరించాడు. ఈ సినిమా విడుదలకు ముందే 'శ్రీకారం'లో నటించడానికి అంగీకరించాడు. ఇందులో శర్వా రైతుగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
'శ్రీకారం' షూటింగ్ త్వరలోనే హైదరాబాద్లో మెుదలుకానుంది. ఎక్కువ భాగం చిత్రీకరణ తిరుపతి, అనంతపురంలో జరగనుందట.