బాక్సాఫీస్ బరిలో పోటీ పడేందుకు అటు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో.. ఇటు మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు ప్రచార పర్వాన్ని జోరుగా పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్.. బన్నీ కన్నా ముందుగా సెన్సార్ పనులను పూర్తి చేసేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా దీనికి 'యూ-ఏ' సర్టిఫికెట్‌ను జారీ చేసింది.
సినిమాలో ఆర్మీ మేజర్‌గా మహేష్ ఎపిసోడ్ ఆయన అభిమానులకు కనులవిందులా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో ప్రిన్స్ కామెడీ టైమింగ్ అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. విజయశాంతి - మహేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతిఒక్కరినీ కట్టిపడేస్తాయని సమాచారం.