'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హిట్టు కొట్టి చిత్రసీమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆ తర్వాత వచ్చిన 'గ్యాంగ్‌లీడర్'లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. '90 ఎంఎల్'తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. అయితే రేపు విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు తలెత్తాయట.
టైటిల్ విషయమై వారు అభ్యంతరం చెప్పారని సమాచారం. ఈ కత్తిరింపులకు దర్శకనిర్మాతలు సుముఖంగా లేదట. టైటిల్ మార్చేందుకు ససేమిరా అంటున్నారని సమచాారం. ఈ సమస్యను అధిగమించి విడుదలకు మార్గం సుగమం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.