తెలుగు చిత్రసీమలోనే కాకుండా దక్షిణాది మొత్తంలో విజయశాంతి( (Lady Amitab Vijayasanthi) పేరు తెలియని వారుండరు. లేడీ అమితాబ్, లేడీ సూపర్‌స్టార్, రాములమ్మ ఈ పేర్లు వినగానే టక్కున గుర్తొచ్చేది ఆమెనే. తెరపై విజయశాంతి కనిపిస్తే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేగేది. విజయశాంతి యాక్షన్ సన్నివేశాలు అభిమానులను మళ్లీ మళ్లీ సినిమా హాళ్లకు రప్పించేవి. ఇలా అందం, అభినయం కలగలిసిన విజయశాంతి దాదాపు 180 చిత్రాల్లో హీరోయిన్గా మురిపించారు. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం.
అవార్డులు..
- విజయశాంతి 1966, జూన్ 24న వరంగల్‌లో జన్మించారు. తన సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు.
- 'కర్తవ్యం' సినిమాకు ఉత్తమనటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు.
- ఏడుసార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు గెలుచుకున్నారు.
- ఆరుసార్లు ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు.
- 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు.
- నాలుగుసార్లు నంది పురస్కారాలను అందుకున్నారు.
విశేషాలు...
- 1990లలో కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటించిన 'కర్తవ్యం'(Karthavyam movie) సినిమాకు రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆ కాలంలో ఏ హీరోయిన్ కూడా పొందని ఎక్కువ రెమ్యునరేషన్ అదే.
- ఆమె నటించిన 'ఒసేయ్ రాములమ్మ'(Osey Ramulamma) వంటి చిత్రాలు టాప్ హీరోస్ రేంజ్లో వసూళ్ల వర్షం కురిపించాయి.
- 'స్వయంకృషి'లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
- 1985లో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన 'ప్రతిఘటన'(PrathiGatana) చిత్రంతో ఆమె పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాలోని ఆమె నటించిన పాత్రకు నంది అవార్డు వరించింది.
- 'రేపటి పౌరులు', 'నేటిభారతం', 'ముద్దులమావయ్య', 'గ్యాంగ్‌లీడర్', 'జానకిరాముడు', 'చిన్నరాయుడు' ప్రేక్షకులను మెప్పించాయి.
- 1998లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.
బాలకృష్ణ, రజనీకాంత్, మోహన్‌లాల్‌తో సెకండ్ ఇన్నింగ్స్
- సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సరిలేరు నీకెవ్వరు'(Sarileru Nekevvaru) సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు విజయశాంతి.
- దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె మొఖానికి రంగు వేసుకొని.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు.
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఇదీ చూడండి: మూడు విషయాల్లో ఈ ఇద్దరి రీఎంట్రీ ఒకటే!