టాలీవుడ్ సీనియర్ హీరోలు సరికొత్తగా కనిపిస్తూ అలరిస్తున్నారు. కుర్రాళ్లకు తామేం తక్కువ కాదంటూ కొత్త లుక్స్‌తో అదరగొడుతున్నారు. రాబోయే సినిమాల కోసం స్టైలిష్‌గా తయారవుతున్నారు. అవసరమైతే పాత్ర కోసం బరువు తగ్గేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, దర్శకుడి నుంచి హీరోగా మారిన వినాయక్ ఉన్నారు. వారి గురించే ఈ ప్రత్యేక కథనం.
యంగ్ లుక్‌లో బాలకృష్ణ.. జోష్‌లో అభిమానులు
నటసింహం నందమూరి బాలకృష్ణ.. 'రూలర్' సినిమా కోసం కొత్త అవతారంలో దర్శనిమిచ్చాడు. ఇటీవలే విడుదల చేసిన ఆ లుక్.. అభిమానుల్లో జోష్ నింపింది. సినిమాపై అంచనాల్ని పెంచింది. ఇందులో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లు. వచ్చే నెల 20న రానుందీ చిత్రం.
'152' కోసం జిమ్‌లో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే 'సైరా' అంటూ స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించాడు. ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకోసం జిమ్‌లో కసరత్తలు చేస్తున్నాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.