బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కష్టాలు తీవ్రమయ్యాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో ఇటీవలే ముంబయి పోలీసులు కంగన సిస్టర్లకు సమన్లు జారీ చేశారు. తాజాగా కంగన.. తనపై నిరాధార వ్యాఖ్యలు చేసిందంటూ రచయిత జావేద్ అక్తర్ కోర్టును ఆశ్రయించారు.
కంగనపై పరువునష్టం దావా వేసిన జావేద్ - కంగన జావేద్ అక్తర్ వార్తలు
ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్.. నటి కంగనా రనౌత్‌పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఓ ఇంటర్వ్యూలో తన పేరును ప్రస్తావించి తన కీర్తికి కంగన భంగం కలిగించిందని ఆరోపించారు.
కంగనపై పరువునష్టం దావా వేసిన జావేద్
కంగనా రనౌత్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన పేరును ప్రస్తావించి.. తన కీర్తికి భంగం కలిగించిందని జావేద్ అక్తర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని అక్తర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తనపై కంగన వ్యాఖ్యలు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.ఈ దావా కేసుకు సంబంధించి డిసెంబరు 3న ధర్మాసనం వాదనలను విననుంది.
Last Updated : Nov 3, 2020, 10:21 PM IST