తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ కోవలోనే బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'తలైవి'. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
జయలలిత బయోపిక్‌లో శశికళ పాత్ర ఆ నటిదే..! - జయలలిత బయోపిక్‌లో ప్రియమణి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. కంగనా రనౌత్ జయ పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే జయలలిత జీవితంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారో చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఇప్పుడు మరో నటి పేరు వినిపిస్తోంది. ఎవరంటే? కథానాయిక ప్రియమణి. జయ స్నేహితురాలు శశికళ పాత్రలో ప్రియమణి నటించనుందని ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. జయ విషయంలో అత్యంత కీలకంగా ఉండే వ్యక్తి శశికళ కాబట్టి అలాంటి పాత్రలో నటించాలంటే ప్రియనే న్యాయం చేయగలుగుతుందని, అందుకే ఆమెను ఎంపిక చేయబోతున్నారని సమాచారం.
ఇవీ చూడండి.. రొమాంటిక్‌గా కనిపిస్తున్న 'రూలర్' బాలయ్య