'బాబాయ్ హోటల్' సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఇప్పటికీ ఎంతో మంది మనసులో నిలిచిపోయింది. ఓ హాస్య నటుడైనప్పటికీ, బ్రహ్మీ అంతకుమించిన భావోద్వేగాన్ని ఇందులో పండించడమే కారణం. మళ్లీ ఇన్నేళ్లకు అదే తరహా పాత్రలో బ్రహ్మీ నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తీస్తున్న 'రంగమార్తాండ'లో ఇలా కనిపించబోతున్నాడని సమాచారం.
"బ్రహ్మానందం.. 'రంగమార్తాండ'లో హృదయాన్ని హత్తుకునే పాత్రలో నటిస్తున్నారు" అని దర్శకుడు కృష్ణవంశీ ఇంతక ముందే చెప్పాడు. అప్పటి నుంచి ఆయన ఎలా కనిపిస్తారా? అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. హాస్యం, భావోద్వేగం మిళితమైన బాబాయ్ లాంటి పాత్ర చేస్తున్నారనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఊపందుకుంది.