Mohanbabu on Akhanda movie:బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా విడుదలైన 'అఖండ' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలయ్య నటనకు, యాక్షన్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు, ఎన్టీఆర్ సహా పలువురు సినీప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపారు. తాజాగా సీనియర్ నటుడు మోహన్‌బాబు కూడా సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. అఖండ విజయం.. విడుదలకి సిద్ధంగా ఉన్న చాలా సినిమాలకు ధైర్యాన్నిచ్చిందని చెప్పారు.
"సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన 'అఖండ' సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది, విడుదలకి సిద్ధంగా ఉన్న చాలా సినిమాలకు ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్య, ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత, సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. మంచి సినిమాను ఆదరించే ప్రేక్షక దేవుళ్లకు ధన్యావాదాలు."
-మోహన్‌బాబు.