తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముంబయిలో కంగనకు నిరసనల స్వాగతం

Sena-ruled BMC demolishes alterations at Kangana's bungalow
కంగనా నివాసాన్ని కూల్చివేస్తున్న బీఎంసీ అధికారులు

By

Published : Sep 9, 2020, 12:22 PM IST

Updated : Sep 9, 2020, 3:24 PM IST

14:49 September 09

వివాదం నడుమ ముంబయి చేరుకున్న కంగన

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ ముంబయిలో అడుగుపెట్టింది. విమానాశ్రయం వద్ద  శివసేన పార్టీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

13:48 September 09

కంగనా రనౌత్ బిల్డింగ్ కూల్చివేతపై స్టే ఇచ్చిన హైకోర్టు

ముంబయిలోని నటి కంగన నివాసాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ విషయమై హైకోర్టులో ఆమె వ్యాజ్యం దాఖలు చేయగా, స్టే ఇచ్చింది న్యాయస్థానం.  

13:36 September 09

భవంతి కూల్చివేత కేసుపై హైకోర్టు విచారణ ప్రారంభం

ముంబయిలోని మున్సిపల్ అధికారులు, తన భవంతిని కూల్చివేయడంపై నటి కంగనా రనౌత్ హైకోర్టను ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ప్రస్తుతం వాదనలు వింటోంది న్యాయస్థానం.

12:59 September 09

తన భవంతి కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన కంగన

ముంబయిలోని తన నివాసం కూల్చివేత అక్రమమంటూ నటి కంగనా రనౌత్​ హైకోర్టును ఆశ్రయించింది. పాలీహిల్​లోని నివాసం అక్రమ కట్టడం అంటూ బీఎంసీ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ కోర్టులో వ్యాజ్యం వేశారు కంగన తరపు న్యాయవాది రిజ్వాన్​ సిద్ధిఖీ. 

"కంగనా నివాసంపై కూల్చివేతపై ఉదయం హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశాం. కూల్చివేతపై స్పందించిన కోర్టు స్టే విధించింది. ఈ తీర్పుతో మాకు ఉపశమనం లభించింది."  

                 - రిజ్వాన్​ సిద్ధిఖీ, కంగనా రనౌత్​ తరపు న్యాయవాది

11:53 September 09

అక్రమ నిర్మాణమని పేర్కొన్న ముంబయి మున్సిపల్ అధికారులు

ముంబయిలో కంగనా రనౌత్​ భవంతి కూల్చివేత

ముంబయిలోని బాంద్రాలో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ నివాసాన్ని అక్రమ నిర్మాణమంటూ​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్ అధికారులు పాక్షికంగా కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకే ఇలా చేశామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేనతో కంగనకు వివాదాలు ఏర్పడిన క్రమంలో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం మున్సిపల్​ అధికారులు నోటీసులు అందజేశారు. ఆమె దగ్గరి నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా నివాసాన్ని కూల్చివేసేందుకు నిర్ణయించింది బీఎంసీ సంస్థ.  

అయితే ఈ నివాసాన్ని అక్రమంగా నిర్మించారంటూ గతంలోనే నోటీసులు అందజేశామని.. మంగళవారం తాజాగా రెండోసారి నోటీసులు అందజేసినా ఎవరు స్పందించకపోవడం వల్లే కూల్చివేత చేపట్టారనేది బీఎంసీ అధికారులు వాదిస్తున్నారు.  

ముంబయికి పయనం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇటీవలే వార్తల్లో నిలిచిన నటి కంగనా రనౌత్.. బుధవారం ఉదయం ముంబయికి పయనమైంది. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న ఆమెకు నెగిటివ్​గా తేలింది. దీంతో ఆమె ముంబయికి చేరుకున్నాక తనను హోమ్​ క్వారంటైన్​లో ఉంచాలని మున్సిపల్​ అధికారులు భావిస్తున్నారు.

శివసేన నేతలతో వివాదం

బాలీవుడ్​ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే ఎక్కువగా భయపడుతున్నానని ఈ మధ్యే కంగన చెప్పింది. దీంతో శివసేన నేత సంజయ్​ రౌత్​, ఆమెను ముంబయి రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. స్పందించిన కంగన.. ముంబయిని పాక్​ ఆక్రమిత కశ్మీర్​తో పోలుస్తూ ట్వీట్​ చేసింది. తద్వారా ఈ వివాదం మరింత వేడెక్కింది. ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో కంగనకు వై- ప్లస్​ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 

Last Updated : Sep 9, 2020, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details