శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తికావొస్తోంది. ఆయన తర్వాతి చిత్రం ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే శేఖర్ కమ్ముల తదుపరి సినిమా.. హీరో నాగచైతన్యతో చేయబోతున్నాడంట. ఈ విషయాన్ని స్వయంగా చైతన్యే తన ట్విట్టర్లో పంచుకున్నాడు.
"హీరోగా నా కెరీర్ను మొదలుపెట్టిన దగ్గరి నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలనుకున్నా. ఆ కల ఇప్పటికి నెరవేరనుంది. మరో మంచి ప్రేమ కథతో మీ ముందుకు రాబోతున్నాం. సునీల్ నారంగ్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబరులో ప్రారంభం కానుంది. సమయం అనుకూలించింది. మీ అందరి మద్దతుకు కృతజ్ఞతలు" - నాగచైతన్య ట్వీట్