'కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ' అంటూ మళ్లీ కూత మొదలుపెట్టబోతున్నారు హీరో గోపీచంద్. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'సీటీమార్'. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. నటి భూమిక ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపించబోతున్నారు.
నవంబరు 23 నుంచి నాన్‌స్టాప్ కూత మొదలు - గోపీచంద్ వార్తలు
లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన 'సీటీమార్' చిత్రీకరణ నవంబరు 23 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది ట్విట్టర్లో వెల్లడించారు.

నవంబరు 23 నుంచి నాన్‌స్టాప్ కూత మొదలు
కరోనా పరిస్థితులతో ఆగిన ఈ చిత్రం.. నవంబరు 23 నుంచి పునఃప్రారంభం కాబోతుంది. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ట్విట్టర్లో తెలియజేశారు. "కూత మొదలు.. నవంబరు 23 నుంచి ఇక నాన్‌స్టాప్" అని దర్శకుడు సంపత్ నంది ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.