గోపీచంద్ కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్'(seetimaarr release date). కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. వినాయక చవితి పురస్కరించుకుని సెప్టెంబరు 10న థియేటర్లలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
seetimaarr: గోపిచంద్ 'సీటీమార్' రిలీజ్ డేట్ ఫిక్స్ - సీటీమార్ రిలీజ్ డేట్
గోపిచంద్-తమన్నా నటిస్తున్న సీటీమార్(seetimaarr release date) కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
సీటీమార్
మరోవైపు అదే రిలీజ్ కావాల్సిన నాగచైతన్య, సాయిపల్లవి లవ్‌స్టోరీ వెనక్కి జరిపినట్లు టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అదే రోజు నాని నటించిన 'టక్ జగదీశ్' ఓటీటీలో విడుదల కావడం గమనార్హం.
ఇదీ చూడండి:నాగ్ 'బంగార్రాజు' షురూ.. 'నూటొక్క జిల్లాల అందగాడు' ట్రైలర్