గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'సీటీమార్' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది సోషల్ మీడియాలో వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్లో ఆలస్యం కావడం, ప్రేక్షకులకు చిత్రంతో మంచి అనుభూతి ఇవ్వాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
గోపీచంద్ 'సీటీమార్' విడుదల వాయిదా - gopichand tamannah seetimaar
కబడ్డీ నేపథ్య కథతో తీసిన 'సీటీమార్' కొత్త రిలీజ్ తేదీని త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు సంపత్ నంది చెప్పారు. ఇందులో గోపీచంద్-తమన్నా జంటగా నటించారు.
గోపీచంద్ 'సీటీమార్' విడుదల వాయిదా
ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ కబడ్డీ కోచ్ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు.