తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అవసరమైతేనే బయటకు రండి: మహేశ్​బాబు - మహేశ్​బాబు మూవీ న్యూస్

కొవిడ్ సెకండే వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హీరో మహేశ్​ వరుస ట్వీట్లు చేశారు. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. మాస్క్​ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.

Mahesh Babu movie news
మహేశ్​బాబు

By

Published : May 8, 2021, 9:36 PM IST

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులతో పాటు, పలువురు ప్రముఖులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కూడా అదే సూచన చేస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని, అది కూడా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వరుస ట్వీటులు చేశారు.

"రోజురోజుకూ కొవిడ్‌-19 తీవ్రమవుతోంది. బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం మర్చిపోవద్దు. అవసరమైతేనే బయటకు వెళ్లండి. ఒకవేళ కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో పరిశీలన చేసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీని ద్వారా అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతామని నేను నమ్ముతున్నా. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి" -ట్విటర్‌లో మహేశ్‌బాబు

మహేశ్‌బాబుతో బాటు పలువురు సినీ నటులు కూడా కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు సినీ నిర్మాణ సంస్థలు కరోనా బాధితులకు అవసరమైన సమాచారాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ వారి అవసరాలను తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details