బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలికి మరోసారి సమన్లు జారీ చేశారు ముంబయిలోని బాంద్రా పోలీసులు. నవంబరు 9,10 తేదీల్లో వారిద్దరు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
అంతకుముందు అక్టోబర్ 26, 27న విచారణకు హాజరుకావాల్సిందిగా కంగనా సిస్టర్స్‌కు సమన్లు పంపారు పోలీసులు. అయితే అప్పుడు వారిద్దరు గైర్హాజరయ్యారు. వారి సోదరుడి పెళ్లి సందర్భంగా విచారణకు రాలేకపోయారంటూ కంగన తరఫు న్యాయవాది జమీందర్ పోలీసులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే వారికి మరోసారి సమన్లు పంపారు ముంబయి పోలీసులు.