దేశద్రోహం కేసులో తన వాంగ్మూలాన్ని సమర్పించడానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హాజరయ్యారు. ఈ కేసుతో పాటు ఆమెపై ఉన్న ఇతర ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం తన సోదరి రంగోలీతో కలిసి బాంద్రా పోలీసు స్టేషన్‌కు చేరారు. ఈ నేపథ్యంలో వై-ప్లస్ కేటగిరీ భద్రత నడుమ ఆమె విచారణకు వచ్చారు.
బాంద్రా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన కంగనా రనౌత్ ఏం జరిగిందంటే?
గతేడాది అక్టోబరులో సోషల్‌మీడియా వేదికగా విద్వేషాన్ని సృష్టించే పోస్టులు పెట్టారని నటి కంగనా రనౌత్‌తో పాటు ఆమె సోదరి రంగోలీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు బాంద్రా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు ఐపీసీ 153-ఏ, 295-ఏ, 124-ఏ, 34 సెక్షన్ల కింద కంగన సిస్టర్స్‌పై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కంగనా రనౌత్‌కు పోలీసులు మూడు సార్లు నోటీసులు పంపినా.. అందుకు ఆమె హాజరు కాలేదు. అయితే ఈ కేసు విచారణలో పాల్గొనేందుకు కొంత సమయం కావాలని నవంబరులో కంగన న్యాయస్థానాన్నిను ఆశ్రయించగా.. ఈ కేసుపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 8న పోలీసుల ఎదుట విచారణకు హాజరై తమ వాంగ్మూలాన్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి:నేహా శర్మ అందానికి కుర్రకారు బేజారు!