తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం.. - మహర్షి

మహర్షి సినిమాలో రెండో పాట వచ్చేసింది. స్టైలిష్ లుక్​లో మహేశ్​బాబు ఆకట్టుకుంటున్నాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతమందించాడు.

నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..

By

Published : Apr 12, 2019, 5:12 PM IST

సూపర్ స్టార్ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'మహర్షి'. ఈ సినిమాలో 'నువ్వే సమస్తం..నువ్వే సిద్ధాంతం...' అంటూ సాగే లిరికల్ పాట విడుదలైంది. ఇప్పటికే వచ్చిన 'చోటి చోటి బాతే...' గీతం సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్​గా కనిపించనుండగా, అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటించాడు.

'నీదొక మార్గం అనితర సాధ్యం.. నీదొక పర్వం శిఖరపు గర్వం...' అంటూ సాగే లిరిక్స్ సాహిత్య ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్​రాజ్, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలుగా వ్యవహరించారు. వేసవి కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'గెలిచి చూపించడం నాకు అలవాటు'

ABOUT THE AUTHOR

...view details