'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి సంబంధించిన రెండో సీక్రెట్‌ను హీరో నాని చెప్పేశాడు. రేపటికి ఈ సినిమాకు 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఇందులోని పాటల వెనుకున్న ఆసక్తికర విశేషాల్ని పంచుకున్నాడు. క్లాస్ అనుకున్న 'అమ్మని తీయని దెబ్బ'ను మాస్ ట్యూన్‌గా వేటూరి ఎలా మార్చారు? అనే సంగతిని వెల్లడించాడు.
అలా వచ్చిన ఆలోచనే 'అమ్మని తీయని దెబ్బ' పాట
'జగదేకవీరుడు అతిలోకసుందరి'లోని పాటల వెనుకున్న సీక్రెట్స్‌ను వెల్లడించాడు నాని. రేపటితో 30 ఏళ్లు పూర్తి చేసుకోనుందీ సినిమా.
'అమ్మని తీయని దెబ్బ' పాట చిత్రీకరణను కేవలం రెండే రోజుల్లో బెంగళూరు, మైసూర్‌లలో దర్శకుడు రాఘవేంద్రరావు పూర్తి చేశారని నాని తెలిపాడు. దేవకన్య ఇంద్రజ ఎంట్రీ సాంగ్.. 'అందాలలో మహోదయం'ను షూట్ చేసేందుకు 11 రోజులు తీసుకున్నారని చెప్పాడు. 'దినక్కుతా దినక్కురో' అనే పాట చిత్రీకరణకు 104 డిగ్రీల జ్వరంతో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారని వెల్లడించాడు. చిరులో ఇంత డెడికేషన్ ఉండటం వల్లే అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయగలిగామని అశ్వనీదత్ గుర్తుచేసుకున్నారని నాని చెప్పాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉండటం వల్లే తెలుగు సినిమా చరిత్రలో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' వండర్‌గా నిలిచిందని అన్నాడు.