తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెరపై 'సెక్షన్​ 375' అమలుకు ముహూర్తం ఫిక్స్ - bollywood

బాలీవుడ్ చిత్రం 'సెక్షన్ 375'ను సెప్టెంబర్ 13న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అక్షయ్ ఖన్నా, రిచా చద్దా ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ బాల్ దర్శకత్వం వహించాడు.

అక్షయ్ - రిచా

By

Published : Aug 3, 2019, 10:18 AM IST

అక్షయ్ ఖన్నా, రిచా చద్దా ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'సెక్షన్ 375'. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. సెప్టెంబర్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. మొదట ఆగస్టు 2న విడుదల చేయాలనుకున్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అత్యాచార సంబంధిత నేరాలకు ఈ సెక్షన్ ద్వారా శిక్షిస్తారు. ఈ సెక్షన్ ఏ విధంగా దుర్వినియోగమవుతుందో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేయనున్నట్టు సమాచారం. మీరా చోప్రా, రాహుల్ భట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

సెక్షన్ 375లో అక్షయ్ ఖన్నా, రిచా తొలిసారిగా కలిసి నటించారు. అజయ్ బాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పనోరమ స్టూడియోస్ బ్యానర్​పై కుమార్ మంగత్ పాతక్, అభిషేక్ పాతక్ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చాడు.

ఇది చదవండి: 'పవర్​స్టార్​ అడిగారని ఆ టైటిల్​ ఇచ్చేశాం'

ABOUT THE AUTHOR

...view details