నటి, హీరోయిన్గా దక్షిణాదిలో రాణిస్తున్న సమంత.. చదువులోనూ టాపర్ అని చాలా మందికి తెలియదు. తాజాగా ఈ విషయాన్ని చెబుతూ తన 10, 11వ తరగతులకు సంబంధించిన మార్కుల జాబితాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదువులోనూ సమంతనే ఫస్ట్ ర్యాంక్ - సమంత స్కూల్ మార్కుల జాబితా
లాక్డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉన్న ముద్దుగుమ్మ సమంత.. తన 10, 11వ తరగతుల మార్కుల జాబితాలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి.
![చదువులోనూ సమంతనే ఫస్ట్ ర్యాంక్ చదువులోనూ సమంతనే ఫస్ట్ ర్యాంక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7403078-30-7403078-1590812175956.jpg)
హీరోయిన్ సమంత
10వ తరగతిలో 1000కిగానూ 887 మార్కులు తెచ్చుకుని 43 మంది విద్యార్థులున్న క్లాస్లో తొలిస్థానం తెచ్చుకుంది సామ్. 11వ తరగతిలోనూ సబ్జెక్టుల పరంగా మంచి మార్కులే తెచ్చుకుంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.