తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రౌడీబేబీ'గా అదరగొట్టిన యువ హీరోయిన్ - sayesha saigal dance

యూట్యూబ్​ సంచలనం 'రౌడీబేబీ' పాటకు డాన్స్ చేసి కుర్రకారును ఫిదా చేసింది హీరోయిన్ సాయేషా సైగల్. ఈ వీడియోను తన ట్విట్టర్​లో పంచుకుంది.

sayesha
సాయేషా సైగల్

By

Published : Jan 19, 2020, 6:40 PM IST

తెలుగు, హిందీ,తమిళ భాషల్లో హీరోయిన్​గా రాణిస్తుంది సాయేషా సైగల్. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్​గా మారింది. యూట్యూబ్​లో సంచలనం సృష్టించిన 'రౌడీబేబీ' గీతాన్ని ప్రాక్టీసు చేస్తూ కనిపించింది. ఈ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేసిందీ భామ. అది ప్రస్తుతం వైరల్​గా మారింది. అయితే దీని ఒరిజినల్ గీతాన్ని ఇప్పటివరకు 750 మిలియన్లకు పైగా వీక్షించడం విశేషం.

'అఖిల్'​ సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టింది సాయేషా. ఆ తర్వాత అజయ్​ దేవ్​గణ్​తో 'శివాయ్'​లో నటించింది. గతేడాది సూర్య 'బందోబస్తు'లో మెరిసింది. తమిళ హీరో ఆర్యను వివాహమాడిన ఈ భామ.. ఈ వీడియోలో కొరియోగ్రాఫర్ శ్రీధర్​తో కలిసి డాన్స్ చేసింది.

ఇదీ చూడండి: మేమిద్దరం కలిస్తే ఆ విషయాలే మాట్లాడుతాం: నభా నటేశ్

ABOUT THE AUTHOR

...view details