- యువ కథానాయకుడు సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం 'తిమ్మరుసు' సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. క్లాసిక్ లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు సత్య. ఓ చేత్తో సూట్‌కేస్ పట్టుకుని బైక్‌పై కూర్చున్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. లాంగ్ హెయిర్, కళ్లద్దాలతో స్టైలిష్‌గా కనిపిస్తూనే సీరియస్‌గా కనిపించారు. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. .
- తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా హీరోయిన్ కంగన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. డిసెంబర్ 5న జయలలిత వర్థంతి సందర్భంగా జయలలితకు కంగనా నివాళులర్పించింది. మరో వారం రోజుల్లో తలైవి సినిమా పూర్తి కాబోతోందని తెలిపింది. కాగా, సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నెటిజన్లకు ఈ లుక్స్ ఆకట్టుకున్నాయి.
- లాక్డౌన్ తర్వాత డిసెంబర్ 4న థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు నాగచైతన్య, విశ్వక్ సేన్, ఆది, నిఖిల్ థియేటర్ వెళ్లి సినిమా చూశారు. చాలా కాలం తర్వాత థియేటర్ అనుభూతిని పొందడం ఆనందంగా ఉందని చెప్పారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రతిఒక్కరూ సినిమా హాళ్లకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
- హైదరాబాద్ యువతి అమ్రిన్ ఖురేషి శనివారం.. నగరంలోని విమానాశ్రయంలో సందడి చేసింది. తాను నటిస్తోన్న ఓ సినిమాలోని పాట చిత్రీకరణ కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం 'జులాయి', 'సినిమా చూపిస్తా మామ' హిందీ రీమేక్‌లలో నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ రెండింటిలో కథానాయకుడిగా ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి నటిస్తున్నాడు. ఈ సినిమాలతో వెండితెర అరంగేట్రం చేయనుందీ భామ.
- బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్.. ఓ స్టంట్ చేసి తన అభిమానులను మరోసారి ఆశ్చర్యానికి గురిచేశారు. దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
- తన పెంపుడు కుక్క హష్ ఉన్న క్యూట్ వీడియోను సమంత షేర్ చేశారు. వ్యక్తిగత ఏకాంతాన్ని కోల్పోయి రెండేళ్లు అవుతోందని, హష్ ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతుంటాడని ఫన్నీగా కామెంట్ చేశారు.
- వ్యాఖ్యాత, నటి అనసూయ మరో సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓ కోలీవుడ్ ప్రాజెక్టులో నటిస్తున్నానంటూ బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేశారు. కథ తనకు చాలా నచ్చిందని తెలిపారు.
- మహేశ్‌బాబు మరోసారి కొత్త లుక్‌లో దర్శనమిచ్చి అలరించారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తీసిన స్టిల్స్‌లో బాగా నచ్చింది ఎంపిక చేయడం కష్టమని, అన్నీ అద్భుతంగా ఉంటాయంటూ మహేశ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో పంచుకున్నారు.
- తన సినిమా 'క్రాక్' సెట్‌లో తీసిన వీడియోను రవితేజ పంచుకున్నారు. బీచ్‌పక్కన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న దృశ్యాన్ని ఫాలోవర్స్‌కు చూపించారు. ఇవాళ్టికి ఇది చివరి షాట్ అని పేర్కొన్నారు.
క్లాస్‌లుక్‌లో సత్యదేవ్.. టైగర్ ష్రాఫ్ స్టంట్స్ అదుర్స్ - satyadev timmarusu first look
కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. యువ కథానాయకుడు సత్యదేవ్ నటిస్తోన్న 'తిమ్మరుసు' సినిమా ఫస్ట్‌లుక్, 'తలైవి' చిత్రంలోని కంగనా కొత్త లుక్స్, లాక్డౌన్ తర్వాత తెరుచుకున్న థియేటర్ అనుభూతి గురించి చైతూ, విశ్వక్ సేన్, నిఖిల్ పంచుకోవడం సహ పలు చిత్రాల సమాచారం ఉంది.
సెలబ్రిటీస్
Last Updated : Dec 5, 2020, 8:02 PM IST