తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గాడ్సే'గా సత్యదేవ్.. షూటింగ్ షురూ - గాడ్సే షూటింగ్ షురూ

యువ నటుడు సత్యదేవ్ హీరోగా 'బ్లఫ్ మాస్టర్' ఫేమ్ గోపీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గాడ్సే'. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపింది చిత్రబృందం.

Satyadev Godse shooting starts
'గాడ్సే'గా సత్యదేవ్.. షూటింగ్ షురూ

By

Published : Feb 11, 2021, 6:20 PM IST

'బ్లఫ్‌ మాస్టర్‌' తర్వాత దర్శకుడు గోపీ గణేశ్‌-నటుడు సత్యదేవ్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం 'గాడ్సే'. ఐశ్వర్యా లక్ష్మి కథానాయిక. మైండ్‌ గేమ్‌ తరహా కథాంశంగా రూపొందుతున్నట్లు సమాచారం. గురువారం చిత్రీకరణ ప్రారంభమైందని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాడు హీరో సత్యదేవ్‌.

గాడ్సే చిత్రబృందం

"గాడ్సే' మొదలైంది. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి" అని ట్వీట్‌ చేశాడు సత్యదేవ్. సి.కె.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నాడు. గోపీ,సత్య కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా కావడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంతోపాటు 'తిమ్మరుసు', 'గుర్తుందా శీతాకాలం'లో నటిస్తున్నాడు సత్యదేవ్‌.

ABOUT THE AUTHOR

...view details