కుటుంబ అనుబంధ అప్యాయత కథా చిత్రాలకు తెలుగులో కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు సతీష్ వేగశ్న. ఆయన తీసిన 'శతమానం భవతి', 'ఎంత మంచివాడవురా' లాంటి చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. ప్రస్తుతం సతీష్ స్వర్గీయ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, తన కుమారుడు సమీర్ వేగేశ్న కథానాయకులుగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.
'కోతి కొమ్మచ్చి' అంటున్న సతీష్ వేగేశ్న - సతీశ్ వేగేశ్న కోతి కొమ్మచ్చి
'శతమానం భవతి' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సతీష్ వేగేశ్న. ప్రస్తుతం ఆయన నుంచి మరో కొత్త సినిమా రాబోతుంది. తాజాగా దానికి సంబంధించిన టైటిల్ ఖరారు చేశారు.
!['కోతి కొమ్మచ్చి' అంటున్న సతీష్ వేగేశ్న 'కోతి కొమ్మచ్చి' అంటున్న సతీష్ వేగేశ్న](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8611257-31-8611257-1598752798649.jpg)
'కోతి కొమ్మచ్చి' అంటున్న సతీష్ వేగేశ్న
తాజాగా మేఘాంశ్, సమీర్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ని ఖారారు చేశారు. చిత్రం పేరు 'కోతి కొమ్మచ్చి'. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎల్.సత్యనారాయణ (సత్తిబాబు’) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కరోనా వైరస్ పరిస్థితి ప్రభావం తగ్గిన వెంటనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.