తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవర్​స్టార్ చేతుల మీదుగా 'శశి' ట్రైలర్ రిలీజ్ - పవన్ కల్యాణ్ ఆది సాయి కుమార్

ఆది సాయికుమార్, సురభి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'శశి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు పవర్ స్టార్ పవన్​కల్యాణ్.

Sashi trailer released by Pawan Kalyan
పవర్​స్టార్ చేతులమీదుగా 'శశి' ట్రైలర్ రిలీజ్

By

Published : Mar 10, 2021, 11:08 AM IST

ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన చిత్రం 'శశి'. శ్రీనివాస్‌ నాయుడు నందికట్ల దర్శకత్వం వహించారు. ఆర్‌.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు పవర్​స్టార్ పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్రైలర్ వీక్షిస్తోన్న పవన్ కల్యాణ్

ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. "మనం ప్రేమించేవాళ్లు మన పక్కన ఉన్నపుడు ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నపుడు అంతే భయంగా ఉంటుంది", "నీలాంటి కుర్రాడి ప్రేమ పెళ్లైతే హ్యాపీ వరకే ఆలోచిస్తుంది.. నాలాంటి తండ్రి ప్రేమ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి ఆలోచిస్తుంది", "ప్రేమంటే లేనిచోట వెతుక్కోవడం కాదు.. ఉన్నచోటే నిలబెట్టుకోవడం" వంటి డైలాగ్స్ అలరిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుందీ సినిమా.

ABOUT THE AUTHOR

...view details