తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగు '96'​ సినిమా విడుదల తేదీ ఖరారు..!

యువ కథానాయకుడు శర్వానంద్​, నటి సమంత కలిసి '96' తెలుగు రీమేక్​లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకొని... నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

సమంత, శర్వానంద్​ సినిమా విడుదల తేదీ ఖరారు..!

By

Published : Oct 26, 2019, 5:34 AM IST

Updated : Oct 26, 2019, 6:50 AM IST

శర్వానంద్‌, సమంత కాంబినేషన్‌లో ఓ ప్రేమకథ రాబోతోంది. తమిళంలో మంచి విజయం అందుకున్న '96' సినిమాకు రీమేక్‌ ఈ చిత్రం. ఇటీవల చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే సినిమా విడుదల తేదీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రేమ కథ కాబట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తోందట చిత్రబృందం. ప్రేమికుల దినోత్సవం రోజున అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట.

టైటిల్​ క్లారిటీ ఎప్పుడో...?

సినిమాకు 'జానకీ దేవి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో ఈ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించినట్లు తెలుస్తోంది. సినిమాలో సమంత.. ప్రముఖ గాయని ఎస్‌ జానకికి వీరాభిమానట. జానకి పాడిన పాటలన్నీ సమంత సినిమాలో పాడుతూ ఉంటుందట.
ఇటీవల షూటింగ్​ పూర్తయినట్లు తెలుపుతూ సోషల్‌మీడియా వేదికగా భావోద్వేగానికి గురైంది సామ్​. సినిమాలో తన స్టిల్‌ను అభిమానులతో పంచుకుంది.

" చిత్రీకరణ పూర్తయింది. నన్ను సవాలు చేసి, నిన్నకంటే ఉత్తమంగా మార్చిన మరో ప్రత్యేక సినిమాలోని పాత్రలో నటించా. రోజూ మ్యాజిక్‌ క్రియేట్‌ చేసే చిత్ర బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నా డ్రీమ్‌ టీంగా ఉన్నందుకు ప్రేమ్‌కుమార్‌, శర్వానంద్‌కు ధన్యవాదాలు. 'జాను'గా నటించడం అదృష్టంగా భావిస్తున్నాను" అని సమంత పోస్ట్‌ చేసింది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. మాతృకను తీసిన సి. ప్రేమ్‌ కుమార్‌ దీనికి దర్శకుడు. తమిళ సినిమా '96'లో త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించారు. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతోపాటు సినీ ప్రముఖుల మెప్పు పొందింది. పాఠశాలలో త్రిష, విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించడం.. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడం.. మళ్లీ ఓ సందర్భంలో కలుసుకోవడం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.

Last Updated : Oct 26, 2019, 6:50 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details