తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"సంగీతమే నా ఊపిరి" - సర్వం తాళమయం

రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'సర్వం తాళమయం' చిత్ర ట్రైలర్ విడుదలైంది.

సర్వం తాళమయం

By

Published : Mar 5, 2019, 12:00 AM IST

తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘'సర్వం తాళమయం'’ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. "వీధిలో ఏమైనా చేయొచ్చు.. కానీ ఇది గుడి".. అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తుంది. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా తెలుగులోనూ తమిళ టైటిల్‌తోనే విడుదలవుతోంది. మైండ్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై లత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details