సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో ప్రకటించారు. అయితో కరోనా కారణంగా షూటింగ్ జరుపుకోలేదు. ఆ మధ్య సినిమా పూజా కార్యక్రమం కూడా ప్రారంభమైంది. సినిమాను తొలుత విదేశాల్లో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు.
'సర్కారు వారి పాట' సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే! - సర్కారు వారి పాట షూటింగ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఈ ఏడాది వేసవిలోనే ప్రకటించినా కరోనా కారణంగా షూటింగ్ జరుపుకోలేదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవనుందట.
తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే సంబంధిత పనులు వేగంగా జరుగుతున్నాయి. జనవరి మధ్య నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో హీరో మహేష్, కథానాయిక కీర్తి సురేష్ కూడా పాల్గొనున్నారని సమాచారం. ఆ తరువాత షెడ్యూల్‌ని యుఎస్‌ఏలోని చికాగో చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మైత్రీ మూవీస్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. చిత్రంలో వెన్నెల కిషోర్, సుబ్బరాజుతో పాటు భారీ తారాగణం నటించనుంది.