తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సర్కారు వారి పాట' ఫస్ట్​లుక్ ఆగయా.. సంక్రాంతికి రిలీజ్ - మహేశ్​ బాబు సినిమా

మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న 'సర్కారు వారి పాట' నుంచి అప్​డేట్​ వచ్చేసింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్​ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో మాస్ లుక్​లో అదరగొట్టాడు సూపర్ స్టార్.

mahesh babu, new movie
మహేశ్ బాబు, మహేశ్ కొత్త సినిమా

By

Published : Jul 31, 2021, 4:08 PM IST

Updated : Jul 31, 2021, 4:31 PM IST

కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల సినిమాల షూటింగ్​లు జోరందుకున్నాయి. అలాగే థియేటర్లూ ఓపెన్ కావడం వల్ల రిలీజ్ డేట్స్, ప్రమోషన్లు, అప్​డేట్స్ అంటూ చిత్రబృందాలు హడావుడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్​ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా అప్​డేట్ ఇచ్చేసింది చిత్రబృందం. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్​ లుక్​ను విడుదల చేసింది. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్​ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. అర్జున్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. బ్యాంకుల ఎగవేత నేపథ్య కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని​ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేశ్​బాబు సరికొత్త లుక్​లో స్టైలిష్​గా కనిపించనున్నారట.

ఇదీ చదవండి:ఈ సంక్రాంతికి ఎంటర్​టైన్మెంట్​ మామూలుగా ఉండదు!

Last Updated : Jul 31, 2021, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details