తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోవాలో 'సర్కారు వారి పాట' యాక్షన్ హంగామా - సర్కారు వారి పాట బ్లాస్టర్

సూపర్​స్టార్ మహేశ్​బాబు తిరిగి యాక్షన్ మొదలుపెట్టేశారు. గోవాలో షూటింగ్​లో పాల్గొన్నారు. ఇటీవల వచ్చిన టీజర్ అభిమానులను తెగ అలరిస్తోంది.

sarkaru vaari paata movie
సర్కారు వారి పాట

By

Published : Aug 13, 2021, 6:46 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తి సురేశ్​ కథానాయిక. పరశురామ్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్​ గోవాలో శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్స్ రామ్​-లక్ష్మణ్​ ఆధ్వర్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్​ చిత్రీకరణ షురూ చేశారు.

సర్కారు వారి పాట ఫైట్​ సీన్ చిత్రీకరణలో మహేశ్

దీనికి సంబంధించిన ఫోటోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో మహేశ్​ బాబుకు దర్శకుడు పరశురామ్ సీన్​ వివరిస్తూ కనిపించారు.

బ్లాస్టర్ రికార్డ్స్..

ఇటీవల మహేశ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'సర్కారు వారి పాట' బ్లాస్టర్.. యూట్యూబ్​లో దూసుకెళ్తోంది. ఇప్పటికే 31 మిలియన్​ వ్యూస్​తో రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. ఈ టీజర్​లో.. స్టైలిష్​ లుక్స్​తో ఆకట్టుకున్నారు ప్రిన్స్​. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న చిత్రం విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details