బాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోయిన్ అనన్యా పాండే. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమల వైపు అడుగులేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ.. మహేశ్‌బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'లో కథానాయికగా ఎంపికైందని సమాచారం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కీర్తి సురేశ్‌ను ఇప్పటికే ఓ హీరోయిన్గా ఎంచుకోగా.. మరో హీరోయిన్ పాత్ర కోసం చిత్రబృందం అనన్యా పాండేను సంప్రదించిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
మహేశ్ సరసన అనన్యా పాండే!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేయగా.. మరో పాత్ర కోసం బాలీవుడ్ నటి అనన్యా పాండేను చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం.
'సర్కారు వారి పాట'లో మహేశ్ సరసన అనన్య!
'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ నిర్మాణ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో జరిగే ఆర్థిక మోసాల కథాంశంతో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో కీర్తి సురేశ్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనుంది. తమన్ స్వరాలు అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్ వినోద్, ఎడిటర్‌గా మార్తాండ్.కె వెంకటేశ్‌లు పనిచేస్తున్నారు.
Last Updated : Aug 5, 2020, 2:56 PM IST