సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మికా మంధాన ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం తాజాగా కేరళకు పయనమైంది. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని.. ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలకపాత్ర చేస్తోంది. తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.