టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మొదటి నుంచి చెప్పిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఇదే తేదీన అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసిన గంట వ్యవధిలోనే 'సరిలేరు నీకెవ్వరు' తేదీని ప్రకటించడం విశేషం.