తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు' - దేవిశ్రీప్రసాద్

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. తాజాగా ఈ సినిమా ఆంథమ్​ను విడుదల చేసింది చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది.

sarileru
దాలను

By

Published : Dec 23, 2019, 5:51 PM IST

'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఆంథమ్‌ వచ్చేసింది. ఈ పాట తనకు చాలా నచ్చిందని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ట్వీట్‌ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్‌ చక్కటి సంగీతం అందించాడని, ఈ పాట వ్యక్తిగతంగా తన హృదయానికి చేరువైందని అన్నాడు. సైనికుల విలువ, వారి త్యాగాల్ని గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట నిజంగా మనసులు కదిలించే విధంగా ఉంది.

"మారణాయుధాలు ఎన్ని ఎదురైనా.. ప్రాణాన్ని ఎదురు పంపేవాడు.. ఒకడే ఒకడు వాడే సైనికుడు.." అంటూ సాగుతోన్న సాహిత్యం ఆకట్టుకుంటోంది. ఈ పాట కోసం దేవిశ్రీ యూరప్‌ వెళ్లి అక్కడి కళాకారులతో కలిసి సంగీతాన్ని కంపోజ్‌ చేశాడు. శంకర్‌ మహదేవన్‌ గాత్రం పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది.

'మహర్షి' తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్‌ రావిపూడి దర్శకుడు. రష్మిక కథానాయిక. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, సత్యదేవ్‌, నరేష్‌, సంగీత, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్లతో నాగ్..!

ABOUT THE AUTHOR

...view details