తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక తేదీ, వేదికను ప్రకటించింది చిత్రబృందం.

sarileru nekevvaru
మహేశ్

By

Published : Dec 15, 2019, 4:25 PM IST

'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం మహేశ్‌బాబు అభిమానులకు ఓ శుభవార్త తెలిపింది. సినిమా విడుదలకు ముందే ఈ హీరోను నేరుగా చూసే అవకాశం కల్పించింది. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రీరిలీజ్ పోస్టర్

ఇవీ చూడండి.. డార్లింగ్ ప్రభాస్‌కు రూ.13 కోట్ల అడ్వాన్స్‌?

ABOUT THE AUTHOR

...view details