'సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. మహేశ్ బాబు ఎంత అందంగా ఉంటాడో 'హీజ్ సో క్యూట్' పాట ద్వారా తెలిపింది హీరోయిన్ రష్మిక. ఇందులో మహేశ్ ఎంత క్యూట్‌గా ఉంటాడో రష్మిక స్టెప్పులూ అంతే క్యూట్‌గా ఉంటాయి. ఇప్పటికే ఈ ప్రోమో విడుదల చేసిన చిత్రబృందం. తాజాగా పూర్తి వీడియోను విడుదల చేసింది.
'హీజ్ సో క్యూట్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది - మహేశ్ బాబు మూవీ అప్డేట్స్
మహేశ్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'హీజ్ సో క్యూట్' పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఫుల్ వీడియో సాంగ్.. 'మహేశ్ ఈజ్ సో క్యూట్'
ఇప్పటికే విడుదలైన 'పార్టీ సాంగ్', 'సూర్యుడివో చంద్రుడివో, 'మైండ్ బ్లాక్' పాటలు అలరించాయి. ఇప్పుడీ జాబితాలోకి ఈ పాట చేరింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని మధుప్రియ ఆలపించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది.
ఇదీ చూడండి.. జోరుగా, హుషారుగా 'ఫైటర్' చిత్రీకరణ