'సరిలేరు నీకెవ్వరూ' సినిమాకు సంబంధించిన టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ను తాజాగా వెల్లడించింది చిత్రబృందం. నవంబర్ 22న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నేడు ప్రకటించింది. ఇందులో మహేశ్... మేజర్ అజయ్ కృష్ణగా నటించిన సన్నివేశాలు, కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద తీసిన సీన్లు కనిపిస్తాయని సమాచారం. రష్మిక మందన్న కథానాయికగా ఆకట్టుకోనుంది. విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది.
'సరిలేరు నీకెవ్వరూ' నుంచి మరో సర్ప్రైజ్ - సరిలేరు నీకెవ్వరూ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా నుంచి మరో అప్డేట్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరందుకోగా.. తాజాగా టీజర్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది.
'సరిలేరు నీకెవ్వరూ' నుంచి మరో సర్ప్రైజ్
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలోని అంగామలై అటవీ ప్రాంతంలో జరుగుతోంది. నవంబర్ 22 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. అనంతరం నవంబర్ 25 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షూటింగ్ జరగనుంది. దిల్‌రాజు, రామబ్రహ్మం, మహేశ్‌బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చాడు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated : Nov 19, 2019, 10:12 PM IST
TAGGED:
సరిలేరు నీకెవ్వరూ