మహేశ్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కథ లీకైంది. చేసింది బయటవారు ఎవరో అనుకుంటే, మీరు పొరబడినట్లే. చిత్రంలోని సన్నివేశాల గురించి చెప్పింది హాస్యనటుడు వెన్నెల కిశోర్. కాకపోతే ఇదంత హాస్యభరితంగానే జరగడం విశేషం. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకుంది.
క్రైమ్ బ్రాంచ్ కోటి(సుబ్బరాజు), అతడి అసిస్టెంట్ కిశోర్(వెన్నెల కిశోర్)ను ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన ఓ రిపోర్టర్.. సినిమా విశేషాలు అడగ్గా "ట్రైన్ ఎపిసోడ్.. కర్నూలు ఎపిసోడ్.. ఆ తర్వాత సార్(క్రైమ్ బ్రాంచ్ కోటి) ఎంట్రీ.. ప్రకాశ్ రాజ్, ఆ తర్వాత రష్మిక... రష్మిక వచ్చిన తర్వాత హీరో వస్తారు.." అంటూ సాగుతున్న ఈ వీడియో అలరిస్తోంది.