తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేరళలో 'సరిలేరు నీకెవ్వరు' సరికొత్త రికార్డు - Sarileru Neekevvaru theatres in Kerala

'సరిలేరు నీకెవ్వరు'ను కేరళలో అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.

కేరళలో 'సరిలేరు నీకెవ్వరు' సరికొత్త రికార్డు
'సరిలేరు నీకెవ్వరు'లో సూపర్​స్టార్ మహేశ్​బాబు

By

Published : Jan 10, 2020, 9:25 AM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు మరో రికార్డు సెట్​ చేశాడు. తను నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు'ను కేరళలో సుమారు 30 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అత్యధిక చోట్ల విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. అందుకు సంబంధించిన పోస్టర్​ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

కేరళలో 'సరిలేరు నీకెవ్వరు' థియేటర్ల జాబాతి

ఆర్మీ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేజర్​గా కనిపించనున్నాడు మహేశ్. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్​రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అనిల్ సుంకర-దిల్​రాజు-మహేశ్​ సంయుక్తంగా నిర్మించారు.

ఇది చదవండి: "సరిలేరు..'తో థ్రిల్​కు గురవుతారు.. అప్పటివరకు ఆగండి'

ABOUT THE AUTHOR

...view details