తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేజర్​ మహేశ్​ కోసం వస్తున్న రామ్​చరణ్!​ - మహేశ్​ బాబు సినిమా

సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్​ ఈవెంట్​ త్వరలో జరగనుంది. ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో రామ్​చరణ్ హాజరు కానున్నాడని సమాాాచారం.

sarileru neekevvaru pre release event chief guest ramcharan tej?
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్​​లో రామ్​చరణ్?​

By

Published : Dec 7, 2019, 5:10 AM IST

ప్రముఖ హీరో సూపర్​స్టార్​ మహేశ్​​బాబు మేజర్ పాత్రలో​ నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రబృందం త్వరలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనుంది. మెగాహీరో రామ్​చరణ్​.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడని సమాచారం.

ముందుగా ఈ ఈవెంట్​కు ఎన్టీఆర్​ను తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నించిందట. సోదరుడు కల్యాణ్​రామ్​ 'ఎంతమంచివాడవురా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండటం వల్ల తారక్​ ఆ సినిమా ప్రచార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అందుకనే 'సరిలేరు' బృందం.. చరణ్​వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.

'సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

మహేశ్​కు చరణ్‌ - తారక్‌ ఇద్దరితోనూ మంచి స్నేహ బంధం ఉంది. వీరిద్దరూ గతంలో 'భరత్‌ అనే నేను' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రస్తుతం రామ్​చరణ్​, ఎన్టీఆర్..​ మల్టీస్టారర్​గా 'ఆర్​ఆర్​ఆర్'​లో నటిస్తున్నారు. దర్శకుధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.

ఇదీ చూడండి: 'టీజర్​, ట్రైలర్ కన్నా ఈ ఎన్​కౌంటర్​ ట్రెండింగ్​లో నిలవాలి'

ABOUT THE AUTHOR

...view details