ఈ ఏడాది 'మహర్షి'తో భారీ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. 'సరిలేరు నీకెవ్వరు'తో పలకరించనున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్లను వినూత్నంగా చేయనున్నారు.
ఇకపై డిసెంబర్ నెల ప్రతి సోమవారం సినిమాలోని ఓ పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. అంటే ఐదు సోమవారాలు, ఐదు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.