సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు ప్రిన్స్.
ట్రైలర్: చిన్న బ్రేక్.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది - మహేశ్‌బాబు-రష్మిక
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ఆద్యంతం అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
"అబ్బబ్బ ఇలాంటి ఎమోషన్స్.. నెవర్ భిఫోర్..నెవర్ ఆఫ్టర్", "మ్యావ్ మ్యావ్ పిల్లి.. మిల్క్ బాయ్‌తో పెళ్లి", "15 ఏళ్ల ఫ్రొఫెషనల్ కెరీర్.. ఇంతవరకు తప్పని రైట్ అని కొట్టలేదు.. నేను తప్పులే చేస్తాను రెడ్డి.. నన్నెవడైనా రైట్ కొట్టాల్సిందే", "మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు.. మీకోసం ప్రాణాలిస్తున్నాం అక్కడ.. మీరేమో అడ్డమైన పనులు, బాధ్యత ఉండక్కర్లా", "చిన్న బ్రేక్ ఇస్తున్నాను.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది" అనే డైలాగ్‌లు అలరిస్తున్నాయి
ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక నటించింది. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ సుంకర-దిల్‌రాజు-మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు.