సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు ప్రిన్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ప్రచారం వేగవంతం చేసింది చిత్రబృందం. అందులో భాగంగానే త్వరలో టీజర్‌ను తెస్తున్నట్లు ప్రకటించింది.
'సరిలేరు నీకెవ్వరు' టీజర్.. ఆన్ ది వే - తెలుగు మహేష్‌బాబు కొత్త సినిమా
హీరో మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. టీజర్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు తెలిపింది.
'సరిలేరు నీకెవ్వరు' టీజర్.. ఆన్ ది వే
ఇందులో మహేశ్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు,అనిల్ సుంకర, మహేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానుందీ చిత్రం.
ఇదీ చూడండి: ట్విట్టర్లో ఇకపై రాజకీయ ప్రకటనలు నిషేధం